రష్యా అధినేత పుతిన్ ..ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల సమయంలోనే అక్కడి 13ప్రధాన నగరాలపై దాడి చేసింది రష్యా.. ఇంత వేగంగా ఒక దేశాన్ని ఆక్రమిస్తుండటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చేమో. పలు నగరాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కేవలం రెండు గంటల్లోనే.. రష్యా బలగాలు మకాం వేశాయి. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ బలగాల బాంబుల దాడితో ఉక్రెయిన్ వణికిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తరహాలో రష్యా విరుచుకుపడుతోంది. ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ కు ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వని విధంగా రష్యా దాడి చేయడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement