స్పా పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. వేర్వేరు ఘటనల్లో ఢిల్లీ పోలీసులు ఈ రాకెట్ తీరును క్రాక్ చేశారు. రిషబ్ విహార్.. పంకజ్ ప్లాజాలోని అవేదం స్పాలో సెక్స్ రాకెట్ సాగుతోందన్న ఇన్ఫర్మేషన్తో ఆనంద్ విహార్ పోలీసులు, స్పెషల్ స్టాఫ్ కంబైన్డ్‌గా ఈ ఆపరేషన్ చేపట్టారు. డెకాయ్ కస్టమర్ స్పాకు వెళ్లడంతో రూ.500కు మసాజ్ చేస్తామని స్పా నిర్వాహకులు చెప్పారు. ఆపై లోపలికి వెళ్లగా అక్కడున్న యువతి రూ. 1000 ఇస్తే కోరిక తీరుస్తానని తెలిపింది. దీంతో డెకాయ్ కస్టమర్ పోలీసులకు సంకేతాలు పంపడంతో పోలీసుల టీమ్ స్పాపై దాడిచేసింది.
ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు స్పా నిర్వాహకుడు నితిన్ గుప్తా కోసం గాలిస్తున్నారు. ఇక మరో ఘటనలో దిల్షాద్ గార్డెన్ కాలనీలోని ఓ స్పాపై జరిపిన దాడుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్పాకు డెకాయ్ కస్టమర్‌గా వెళ్లిన వ్యక్తితో స్పా హెడ్ సుధ అతడికి ఇద్దరు అమ్మాయిలను సమకూరుస్తానని చెప్పింది. కస్టమర్‌కు ఇద్దరు యువతులను చూపిన ఆమె రూ 1500 ఇవ్వాలని కోరింది. ఈ స్పా వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.