చిరుతపులుల్లో చాలా రకాలు ఉంటాయి..అయితే ఓ అరుదైన చిరుత కెమెరాకి చిక్కింది. దక్షిణ రాజస్థాన్ లోని ఆరావళి కొండల్లోని రణక్ పూర్ ప్రాంతంలో పింక్ చిరుత జాడలు కనిపించాయి. భారతదేశంలో ఈ రకం చిరుత కనిపించడం ఇదే తొలిసారి. రణక్ పూర్, కుంభాల్ ఘర్ లోని స్థానికులకు ఇది తరచూ కనిపిస్తోందట. విస్తారమైన అటవీ ప్రాంతం కారణంగా ఈ గులాబీ రంగు చిరుత చక్కర్లు కొడుతున్నట్లు చెబుతున్నారు.ఇది ఎంతో వైవిధ్యమైన జాతికి చెందిందని తెలిపారు శాస్త్రవేత్తలు. ఉదయ్ పూర్ కు చెందిన వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త హితేష్ మోత్వాని ఈ చిరుత కోసం నాలుగురోజులపాటు వెతికి మరీ ఫోటోలు తీశారు. దీని వయసు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుందని అంటున్నారాయన.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily