Saturday, November 23, 2024

బ్రిట‌న్ లో అరుదైన కేసు.. మ‌ద్యానికి బానిసైన శున‌కం

బ్రిట‌న్ లో ఓ అరుదైన కేసు వెలుగులోకి వ‌చ్చింది. త‌న పెంపుడు కుక్క‌కి మ‌ద్యం అల‌వాటు చేశాడు య‌జ‌మాని..కాగా ఆ య‌జ‌మాని రీసెంట్ గా మ‌ర‌ణించాడు. ప్లిమొత్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడు కుక్కకు కూడా మద్యం పోయడంతో అది కూడా అలవాటు పడిపోయింది. యజమాని మరణించాక ఆ శునకం తీవ్ర అనారోగ్యం పాలైంది. ఇది గమనించిన స్థానికులు.. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ కుక్కకు తరచూ ఫిట్స్ వచ్చేది. అనేక ఇతర సమస్యలతోనూ సతమతమయ్యేది. ఈ రోగ లక్షణాలను పరిశీలించిన వైద్యులు అది మద్యానికి బానిసైందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. ఇటీవలే అది కోలుకుంది. అయితే.. ఓ కుక్క మద్యానికి బానిసై కోలుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.ఇప్పుడీ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement