Monday, November 18, 2024

Corona: రాష్ట్రంలో వేగంగా కొత్త సబ్‌ వేరియంట్ల వ్యాప్తి.. బీఏ4 కేసులు తెలంగాణలో ఎక్కువే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కరోనా ఒమిక్రాన్‌ కొత్త సబ్‌వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ బీఏ4 సబ్‌వేరియంట్‌ కేసులు 68 నమోదు కాగా అందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే 20 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక దేశ వ్యాప్తంగా 331 బీఏ5 వేరియంట్‌ కేసులు నమోదు కాగా అందులో తెలంగాణలో 28 కేసులు నమోదుయ్యాయి. బీఏ4 అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. మరోవైపు బీఏ5 కేసుల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజు నమోదువుతున్న కరోనా కేసులు 700 మార్కును దాటాయి. వరుసగా రెండో రోజూ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 700 కు మించి నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 13, 120కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 662 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4686కు చేరింది. కరోనా కేసులు కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ప్రతీ రోజూ 30వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం వరకు రోజూ 20వేల వరకే టెస్టులు చేసేవారు. క్రమంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో టెస్టుల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 32, 808 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 377 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 24, కరీంనగర్‌ 12, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 53, రంగారెడ్డిలో 60, నల్గొండ 25, సంగారెడ్డిలో 8, పెdద్దపల్లి 24, నల్గొండ 20, మంచిర్యాల 26, హన్మకొండ జిల్లాలో 16 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement