పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేరళ సెలబ్రిటీ యూట్యూబర్ శ్రీకాంత్ వెట్టియార్ పై కేసు నమోదైంది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొచ్చి సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ హోటల్, అపార్ట్ మెంట్లో తనపై రెండుసార్లు దారుణంగా అత్యాచారం చేశారని ఫిర్యాదులో నిందితురాలు పేర్కొంది.
కాగా, శ్రీకాంత్ వెట్టియార్ ఫేమస్ సినిమాల స్పూఫ్ వీడియోలకు ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ గా పేరుగాంచారు. అయితే.. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం మహిళా సాధికారత, రాజకీయ సమానత్వం వంటి సమస్యలపై వెట్టియార్ పోస్టు చేసిన వీడియోలకు తాను అట్రాక్ట్ అయ్యానని ఆ మహిళ పేర్కొంది. పిటిషనర్ ఎనిమిదేళ్ల బాలుడికి తల్లి.. ఆమె కొచ్చిలో నివసిస్తున్నప్పుడు శ్రీకాంత్ వెట్టియార్తో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది.
2021 ఫిబ్రవరిలో జరిగిన శ్రీకాంత్ వెట్టియార్ పుట్టినరోజు వేడుకకు తనను ఆహ్వానించారని.. ఎర్నాకులంలోని అలువాలోని ఫ్లాట్లో, ఆ తర్వాత కొచ్చి సిటీలోని హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని శ్రీకాంత్ వెట్టియార్ తన స్నేహితులను బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పదే పదే ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపించింది.
శ్రీకాంత్ వెట్టియార్పై ‘విమెన్ ఎగైనెస్ట్ సెక్సువల్ హరాస్మెంట్’ అనే ఫేస్బుక్ పేజీ గతంలో రెండు #మీటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..