Saturday, November 23, 2024

Rangareddy Politics … శి’వార్’ లో గెలుపెవ‌రిది…

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటేనే ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న జిల్లాగా పేరుంది. భూముల క్రయవిక్రయాలు, మద్యం అమ్మకాలు… వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సమకూర్చిపెడుతోంది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా విస్తరించి ఉండటంతో ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువే. ఈ ప్రాంతంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. తెలంగాణ సాధించినప్పుడు జరిగిన ఎన్నికల్లో సగం స్థానాలు తెదేపా కైవసం చేసుకుంది… 2018 ఎన్నికల్లో మాత్రం ప్రజలు తీర్పు మార్చారు… మెజార్టీ నియోజకవర్గాల్లో భారాస పాగా వేయగా కేవలం మూడు స్థానాలతో కాంగ్రెస్‌ సరిపెట్టుకుంది. మహేశ్వరం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సబితారెడ్డితోపాటు మరో ఇద్దరు భారాసలో చేరిపోయారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షాలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లిdలకు అన్నింట్లో భారాస పాగా వేసింది. రానున్న ఎన్నికల్లో గత ఫలితాలు సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ బలపడుతోంది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. భాజాపా మెజార్టీ స్థానాలపై దృషిపెట్టింది. శివారు ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసించిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి, తూళ్ల దేవేందర్‌గౌడ్‌ల పుత్రులు ఒక్క చాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు…

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో:

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విలక్షణమైన జిల్లా. ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు.. గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. శివారు ప్రాంత నియోజక వర్గాలు అభివృద్ధి చెందగా.. గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతు న్నాయి. ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఒకప్పుడు తెదేపాకు కంచుకోటగా ఉన్న జిల్లా రానురాను భారాసకు కంచుకోటగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14అసెంబ్లిలు రెండు పార్లమెంట్‌ నియోజక వర్గాలున్నాయి. ఇందులో 2014 ఎన్నికల్లో తెదేపా ఏకంగా ఏడు అసెంబ్లిd, ఒక పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకుంది… రాష్ట్ర వ్యాప్తంగా భారాస గాలి వీచిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం తెదేపా సగం సీట్లు కైవసం చేసుకుంది. తెదేపా గెలిచిన సీట్లు అన్నీ కూడా శివారు ప్రాంతాలకు చెందినవే. ఈ ప్రాంతాల్లో సెటిలర్లు ఎక్కువమంది ఉండటం వాళ్లంతా తెదేపా వైపు మొగ్గు చూపారు.. అప్పట్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ అసెంబ్లిలతో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అప్పట్లో భారాసకు మేడ్చల్‌, వికారాబాద్‌, తాండూరు. మల్కాజ్‌గిరి అసెంబ్లిdలతోపాటు చేవెళ్ల పార్లమెంట్‌ సీటు దక్కింది. కాంగ్రెస్‌కు చేవెళ్ల, పరిగి నియోజకవర్గాలకే పరిమితమైంది. ఉప్పల్‌లో మాత్రమే భాజాపా పాగా వేసింది. 2018 ఎన్నికల్లో తెదేపాకు కనీస డిపాజిట్లు కూడా దక్కలేదు.. కాంగ్రెస్‌తో కలిసి బరిలో దిగారు. ఎక్కడా కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు.

తిరుగులేని శక్తిగా భారాస..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారాస తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2014 అసెంబ్లి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు అసెంబ్లిలు, పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకున్న భారాస 2018 ఎన్నికల్లో మాత్రం మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లిలకు గాను ఏకంగా 11 స్థానాల్లో విజయం సాధించింది. మహేశ్వరం, ఎల్బీనగర్‌, తాండూరు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ ముగ్గురు కూడా ఏడాది తరువాత భారాసలో చేరి పోయారు. మహేశ్వరం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సబితారెడ్డి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతు న్నారు… పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్లను కైవసం చేసుకోగా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ సీటును కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా కొనసాగుతు న్నారు. తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో భారాస క్లీన్‌ స్వీప్‌ చేసింది. మూడు జడ్పీ స్థానాలతోపాటు మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా భారాస సత్తా చాటుకుంది. కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, సహకార ఎన్నికల్లో కూడా తిరుగులేదని నిరూపిం చుకుంది. ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఏడు కార్పొరేషన్లు, 25 మునిసిపాలి టీల్లో పాగా వేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలను భారాస ఏకగ్రీవంగా దక్కించుకుంది. పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

- Advertisement -

మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డిలకు ఇంటిపోరు!
విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలకు ఇంటిపోరు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు ఈసారి టికెట్టు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా రు. మహేశ్వరం నియోజక వర్గంలో సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెదేపా తరపున విజయం సాధించి ఆ తరువాత భారాసలో చేరిన తీగల కృష్ణారెడ్డి ఈసారి తనకు చివరి ఎన్నికలని తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2018 ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా మహే శ్వరంలో తీగల కృష్ణారెడ్డి పోటీ చేశారు. సబితారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పదివేలకు పైగానే మెజార్టీతో విజయం సాధించారు. ఏడాది తరువాత సబితారెడ్డి భారాసలో చేరడం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నా రు. ప్రస్తుతం నియోజకవర్గంలో రెండు వర్గాలు కొనసాగుతు న్నాయి. మెజార్టీ వర్గం సబితా రెడ్డి వైపే కొనసాగుతోంది. ఈసారి టికెట్టు సబితారెడ్డికే పక్కాగా కనిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ మహేశ్వరం నియోజక వర్గంలో పర్యటించారు. సబితారెడ్డిని ఇంటి ఆడబిడ్డగా అబివర్ణిం చారు. ఆమె ఆడిగిందే తడువు గా ఏకంగా రూ.160 కోట్లు మంజూరు చేశారు. ఒక రోజు వ్యవధిలోనే సీఎం సభ ఏర్పా ట్లు చేయడంతో సబితారెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి నుండి పోటీ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈసారి తనకు టికెట్టు ఇవ్వా లని ఆయన కోరుతున్నారు. జడ్పీ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి కొడుకు శరత్‌చంద్రారెడ్డి కొనసాగుతున్నారు.

అధికార పార్టీలో ఆశావహులే ఎక్కువే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో 14 అసెంబ్లిdల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనసా గుతు న్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ తప్పడం లేదు. కొన్ని నియోజక వర్గాల్లో ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. శివార్లలో మాత్రం సిట్టింగ్‌లే ముందు వరుసలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో మాత్రం ఇద్దరేసి చొప్పున పోటీపడుతున్నారు. తాండూరు లో మాజీ మంత్రి పట్నం మహేంద ర్‌రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పోటీపడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ మారే ఆలోచనలో మహేందర్‌రెడ్డి ఉన్నారు. చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ రత్నం టికెట్టు ఆశిస్తున్నారు. పరిగిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. సేవా కార్య క్రమాలతో మనోహర్‌రెడ్డి చొచ్చుకు పోతున్నారు. ఇబ్ర హీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌ రెడ్డితోపాటు క్యామ మల్లేష్‌ టికెట్టు ఆశిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాష్‌గౌడ్‌కు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి నుండి పోటీ నెలకొం ది. యువత కోటాలో సీటు సాధిం చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వికారాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తోపాటు వడ్లనందు కూడా రేసులో ఉన్నారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. ఇక్కడ బండి రమేష్‌ అవకాశం కల్పించాలని కోరు తున్నారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మె ల్యే వివేకానందతోపాటు ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న శంభీపూర్‌ రాజు అవకాశం వస్తే బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఎల్బీనగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితోపాటు రామ్మోహన్‌గౌడ్‌ పోటీపడుతున్నారు. మొత్తం మీద కొన్ని నియోజకవర్గాల మినహా మెజార్టీ మెజార్టీ నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది.

పుంజుకుంటున్న కాంగ్రెస్‌
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో అంతా తానై వ్యవహరించిన మాజీ మంత్రికి కాంగ్రెస్‌ గాలం వస్తోంది. ఆయనకు సీటు ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనతోపాటు మరికొంతమం దికి టికెట్లు ఇస్తామని హామి ఇచ్చిన నేపథ్యంలో భారాసకు చెందిన నేతలు టికెట్టు రానిపక్షంలో పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో చాలామంది కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. అప్పట్లో చేవెళ్ల, పరిగి సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఇందులో చేవెళ్ల నుండి విజయం సాధించిన కాలె యాదయ్య తరువాత అధికార పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మూడు అసెంబ్లిdలను మాత్రమే కైవసం చేసుకుంది. ఆ ముగ్గురు కూడా అధికార పార్టీలో చేరిపోవ డంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేకుండాపోయింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ పరిస్థితి కొంతమేర మెరుగ్గా కనిపిస్తోంది. కీలక నేతల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఎంతమేర విజయం సాధిస్తారో వేచి చూడాలి.

శివార్లపై భాజపా నజర్‌
శివారు ప్రాంత నియోజకవర్గాలపై భాజపా దృష్టిని కేంద్రీకరించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో శివార్లలో ఎక్కువ సీట్లు కైవసం చేసు కుంది. అసెంబ్లి ఎన్నికల్లో శివార్లలో ఎక్కువ సీట్లు సాధిస్తామ నే నమ్మకంతో ఉన్నారు. మిగతా పార్టీల తో పోలిస్తే భాజపా చాలా కష్టపడాల్సి ఉంది. మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బహిరంగ సభలు నిర్వహిం చారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలను మాత్రం దూరం చేయలేకపో తున్నారు. పార్టీలో చేరిన కొందరు నేతలు బహి రంగసభ వేదికపైనే తమ అనుమానాలను వ్యక్తం చేశారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గా ల్లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధంగా ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర పార్టీల నుండి వచ్చే నేతలను రంగంలో దింపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్క చాన్స్‌ కోసం..
ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీ యాలను ఒంటిచేతితో శాసించిన మాజీ మంత్రులు పట్లోళ్ల ఇంద్రారెడ్డి, తూళ్ల దేవేందర్‌గౌడ్‌ల తన యులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, తూళ్ల వీరేందర్‌ గౌడ్‌లు ఒక్క చాన్స్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతోమందికి రాజకీయ అవకా శాలు కల్పించిన నేతల తనయులు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో వీరిద్దరు చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్‌ నుండి బరిలో దిగగా వీరేందర్‌గౌడ్‌ మాత్రం తెదేపా తరపున పోటీ చేశారు. వీరిద్దరు ఓటమిపాలయ్యారు. 2018 ఎన్ని కల్లో వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ అసెంబ్లి బరిలో దిగినా ప్రయోజనం లేకుండాపో యింది. ప్రస్తుతం కార్తీక్‌రెడ్డి భారాసలో కొన సాగుతుండగా వీరేందర్‌గౌడ్‌ మాత్రం భాజపాలో ఉన్నారు. వీరిద్దరూ అసెంబ్లి బరిలో దిగా లనే పట్టుదలతో ఉన్నారు. వీరికి పార్టీ పెద్దలు అవకాశం కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement