బ్రహ్మాస్త్ర చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు బాలీవుడ్ నటులు ఆలియాభట్, రణ్ బీర్ కపూర్. కాగా వారి ఇంట పెళ్లి పనులు ప్రారంభమైనట్లు బాలీవుడ్ లో టాక్. ఏప్రిల్ లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారట. డిజైనర్ మనీష్ మల్హోత్రాను రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ కలిసి వీరి పెళ్లి పనులు ప్రారంభించింది. ఈ ప్రముఖ డిజైనర్ రణ్ బీర్ ఇంటికి పలుమార్లు వెళ్లి మాట్లాడి వచ్చారు. తాము ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతల దగ్గర ఏప్రిల్లో అనుకుంటున్న షెడ్యూల్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు అలియా రణ్ బీర్. దీంతో వచ్చే నెలలోనే ఓ మంచి ముహూర్తానికి .. ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లిపీటలెక్కబోతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement