Sunday, November 24, 2024

ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియాభ‌ట్ ఇంట పెళ్లి సంద‌డి

బ్ర‌హ్మాస్త్ర చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు బాలీవుడ్ న‌టులు ఆలియాభ‌ట్, ర‌ణ్ బీర్ క‌పూర్. కాగా వారి ఇంట పెళ్లి పనులు ప్రారంభమైనట్లు బాలీవుడ్ లో టాక్. ఏప్రిల్ లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారట. డిజైనర్ మనీష్ మల్హోత్రాను రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ కలిసి వీరి పెళ్లి పనులు ప్రారంభించింది. ఈ ప్రముఖ డిజైనర్ రణ్ బీర్ ఇంటికి పలుమార్లు వెళ్లి మాట్లాడి వచ్చారు. తాము ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతల దగ్గర ఏప్రిల్‌లో అనుకుంటున్న షెడ్యూల్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు అలియా రణ్ బీర్. దీంతో వచ్చే నెలలోనే ఓ మంచి ముహూర్తానికి .. ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో మ‌రో ప్రేమ జంట పెళ్లిపీట‌లెక్క‌బోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement