దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక సెక్స్ సీడీ కేసులో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ కేసులో బాధిత యువతి ఇన్నాళ్ళ అజ్ఞాతంలో ఉండి పోయింది. అయితే ఈ రోజు ఆ యువతి అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో అందరి దృష్టి ఈ అంశం పైకి మళ్ళింది. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళితో బాధిత యువతి ఏకాంతంగా ఉన్న వీడియో ఒకటి ఈ నెల 2న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ సీడీలో కనిపించిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె కోసం పోలీసులు వెతికినప్పటికీ ఆచూకీ గుర్తించలేకపోయారు. అజ్ఞాతంలో నుంచే ఆమె ఇప్పటి వరకు 5 వీడియోలు విడుదల చేశారు. కాగా, ఆమె నేడు కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆమె నేడు కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని యువతి తరఫున న్యాయవాది జగదీశ్ కూడా చెప్పారు. అదే జరిగితే కోర్టులోనే ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, యువతి తల్లిదండ్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.