Friday, November 22, 2024

రామ‌ప్ప పేరు క‌ల్పిత‌మా… మ‌రి అస‌లు పేరేంటి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రపంచవారసత్వ దినోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతున్న రామప్ప దేవాలయం పేరు లోనే విభిన్న కథనాలు ఉన్నాయి. దేశంలోని రాజ్యాల్లో ఒక వెలుగు వెలిగిన కాకతీయ సామ్రాజ్యమంలో నిర్మించిన ఈ కట్టడానికి యునెస్కో గుర్తింపు లభించి విశ్వవ్యాప్తి అయిన ప్పటికీ రామప్ప ఆలయం అసలు పేరును జనం ఏనాడో మర్చి పోయారు. రామప్ప అనేశిల్పి పేరుతో ఈ ఆలయానికి ఆపేరు వచ్చిందనే ప్రచారాన్ని కొందరు చరిత్రకారులు తప్పుబట్టి కాక తీయుల పాలనలో రామప్ప శిల్పి లేడని నిర్ధారించినా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధారణకు రావల్సి ఉంది. కాక తీయు లకంటే ముందు ఇక్కడ ఉన్న రామచెరువు తోనే జన పదుల్లో ఈ ఆలయానికి రామప్ప ఆలయంగా పేరువచ్చినట్లు తెలు స్తుంది. క్రీ.శ. 4నుంచి 6వ శతాబ్దం వరకు పాలించిన విష్ణు కుం డిన వంశం రాజులు కట్టించిన రామలింగేశ్వర ఆలయం ఆన వాళ్లు పరిసరాల్లో ఉండటంతో ఈ వాదన బలపడు తుంది.

వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, శిల్పం,నాట్యం చిత్రకళ రంగాల్లో తమదైన ప్రత్యేక శైలిని పునికి పుచ్చుకున్న కాకతీయ చరిత్రలో రామప్ప ప్రస్తావనలేదు. అయితే ఆనాటి కట్టడాలుగా ఓరుగల్లు వరంగల్‌ గా , అను కొండను హనుమకొండగా, శ్రీ రుద్రేశ్వరాలయాన్ని రామప్ప దేవాలయంగా పిలవడం ప్రజలకు అలవాటుకావడంతో ప్రభుత్వ గెజిట్‌ లో కూడా ఈ పేర్లు నమోదు అయ్యాయి. శిల్పకాళారీతికి నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయాన్ని రామప్పగా గుడిగా పిలుస్తు న్నారు. గణపతి దేవుడిని మహారాష్ట్ర లోని దేవగిరి యాదవ రాజుల నుంచి క్రీ.శ. 1199లో విడిపించుకు వచ్చి కాకాతీయ రాజ్య స్థపనాచార్య బిరుదుపొందిన అనంతరం రేచర్ల రుద్రు సేనాని నిర్మించిన ఈ దేవాలయానికి శ్రీ రుద్రేశ్వరాలయం గా శాసనం వేయించారు. ఈ ఆలయాన్ని నిర్మించి మార్చి 31 నాటికి 888 సంవత్సరాలు అవుతుంది.

శ్రీరుద్రేశ్వరాలయం ప్రాంగణంలోని రేచర్ల రుద్రుని శాస నాల్లో క్రీ.శ. 1135 శ్రీముఖ సంవత్సరం చైత్ర శుక్ల అష్టమి ఆదు వారం పుష్కార్యయోగంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో గౌరీ సహిత రుద్రేశ్వరున్ని ప్రతి ష్టించడంతో పాటుగా ఆలయం నిర్వహణకోసం ఉప్పరపల్లి, బార్లపల్లి గ్రామాలను దానం చేసినట్లు శాసనంలో పేర్కొ న్నారు. ఓరుగల్లు పురంలో రుద్రసేనాని కట్టించిన ఆలయం ఉందనీ, ఓరుగల్లు విస్తీర్ణం 96 యోజనాలు (155 కిలోమీటర్లు )ఉందని 16వ శతాబ్దంలో వెలుబడిన ఏకామ్ర నాథుని ప్రతాప రుద్ర చరిత్ర లోని 128వ పేజీలో ఉంది. రామప్పగుడిగా జనం నోట పేరుమారిన రుద్రేశ్వరాలయం లో కాకతీయుల శిల్పరీకులు మహా అద్భుతం. ఆలయ పైభా గంలో ఎటవాలుగా నిలిచిన మనోహర మదనిక శిల్పాలు ఆనా టి సామ్రాజ్యంలోని సామాన్యస్త్రీలవి. నాటి సామాన్య స్త్రీలు ఎక్కువగా ఆభరణాలు ధరించేవారని ఈ శిల్పాల్లో స్పష్టం అవు తుంది. ఈ శిల్పనైపుణ్యత ప్రపంచప్రజలను ఇప్పటికీ అబ్బు రపరుస్తుంది. అయితే ఎక్కడ శిల్పి ప్రస్తావనలేదు. పరమ శివారాధకులైన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించడంతో పాటుగా పేర్లలోను రుద్రుడు పెట్టుకున్నారు. రుద్రదేవమహా రాజు, రుద్రమదేవీ, ప్రతాపకుమార రుద్ర దేవ మహారాజు శబ్దంతోనే రాజవంశీయుల పేర్లు ఉండేవి. అయితే శాసనాల్లో ఎక్కడ రామప్పదేవాలయ ప్రస్తావన లేకపోవడం గమ నార్హం. అయితే కాలగమనంలో చరిత్ర పేర్లలో వచ్చిన మా ర్పులకు నిదర్శనంగా అనేక ప్రాచీన కట్టడాలపేర్లు మారడంతో రాబోయో తరానికి చరిత్ర ఓప్రశ్నార్థకంగా మిగిలింది.

రామప్ప శిల్పి పేరు కల్పితం
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో రామలక్ష్మణుల మీద రామవాగు, లక్ష్మణ వాగు అనేవి మనుగడలో ఉండేవని చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు. కాకతీయులు రామవాగు మీద రామప్పచెరువు, రుద్రేశ్వర ఆలయం నిర్మించడంతో స్థానికులు రామప్పగా వ్యవహరించే వారని చెప్పారు. ఆనాడు కన్నడ,తెలుగు కలిసి ఉండటంతో అప్పా శబ్దం వచ్చింది. క్రీ.శ. 4,6 శతాబ్దాల మధ్య పాలించిన విష్ణు కుండిన రాజులు ప్రత్యేకించి మాధవవర్మ శైవ వైష్ణవ మతాల సమ్మేళనంగా రామప్రతిష్ట త లింగం తో దేవా లయాలు కట్టించారు. అయితే స్థానికులు రామున్ని రామ ప్పగా పిలవడంతో ఈ ప్రాంతంలో నిర్మించిన కాకతీయు లకట్టడానికి కూడా రామప్పగా గుర్తింపువచ్చిందేకానీ రామప్ప అనే శిల్పి తోకాదని చెప్పారు. రామప్ప అనే శిల్పి కాకతీయుల చరిత్రలో ఎక్కడలేడని సత్యనారాయణ తెెల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement