Saturday, November 23, 2024

ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లు – మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి ప్రభా న్యూస్ : ప్రతీ పండుగను అందరు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా, ముందుకెళుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ .. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని తెలిపారు.
బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలకు సారెలు పంపిణీ చేస్తున్నట్లు.. రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాకు ఆరు వేల గిఫ్ట్ ప్యాక్ లు వచ్చాయని తెలిపారు. నిర్మల్ కు 2000, ముధోల్ కు 2500, ఖానాపూర్ నియోజకవర్గానికి 1500 కేటాయించామని ..నిర్మల్ కు అదనంగా1000 గిప్ట్ లు తెప్పించామని తెలిపారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి గిఫ్ట్ లు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదుల పరిధిలోని దాదాపు ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు ప్రభుత్వం కానుక అందిస్తున్నదని అన్నారు. అనంతరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే , మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, RDO రమేష్,FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్,ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణ కౌన్సిలర్లు తెరాస నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement