Friday, November 22, 2024

RGV: ‘భీమ్లా నాయక్’ పాన్ ఇండియా మూవీ కాదా?: పవన్ పై వర్మ ఆసక్తికర ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల సినిమా టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ తో మినీ యుద్ధమే చేశారు. తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన  ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అయితే.. ఈ సినిమా విడుదలపై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘’ఇంటీరియర్ ఆంధ్రలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ?’’ అని పవన్ కల్యాణ్ ను ఆర్జీవీ ప్రశ్నించారు. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్‌,రాంచరణ్‌ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి” అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి పవన్ కల్యాణ్ గారు. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ పవన్‌ కళ్యాన్‌ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేమంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి అని వర్మ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement