Saturday, September 21, 2024

పవన్ అభిమానిగా నేను హర్ట్ అయ్యా: భీమ్లా నాయక్ పై ఆర్జీవీ ట్వీట్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ట్రైలర్ హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలీలో స్పందించారు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను భీమ్లా నాయక్ అని కాకుండా డానియల్ శేఖర్ అని పిలవాలని అనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డాడు. రానా దగ్గుపాటిని ప్రమోట్ చేసేందుకు మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించారన్నారని ఆరోపించారు. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ కంటే రానాకే హైప్ వచ్చిందన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని అన్నారు. ఉత్తరాదిలో పవన్ కళ్యాన్ కంటే రానాకే ఎక్కువ ప్రజాదరణ ఉందన్నారు. బాహుబలి కారణంగా రానా మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.  ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement