Tuesday, November 26, 2024

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై ట్విట్టర్​లో కామెంట్స్​.. వర్మపై లక్నోలో కేసు నమోదు!


ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ డైరెక్టర్​, నిర్మాత రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఓ ట్వీట్‌లో ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపారు. హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఆయన తెలిపారు.

‘‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు.. మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు?” అని జూన్ 22న వర్మ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.  జూన్ 24న కూడా ఒక ట్వీట్‌లో తన స్టాండ్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించాడు.. “ఇది చాలా వ్యంగ్యంగా చెప్పానని, మరే విధంగానూ ఉద్దేశించి చేయలేదు. మహాభారతంలో ద్రౌపది​ అంటే నాకు ఇష్టమైన పాత్ర.. కానీ, ఆ పేరు చాలా అరుదు కాబట్టి నేను అనుబంధ పాత్రలను మాత్రమే గుర్తుంచుకున్నాను.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదు” అని మరో ట్వీట్​లో వర్మ తెలిపారు. ఆ తర్వాత జూన్ 25న రెండు ట్వీట్లు చేశాడు.

మొదటి ట్వీట్‌లో  “అత్యంత గౌరవనీయుడైన ద్రౌపది అధ్యక్షుడిగా ఉన్న గొప్పతనం ఏమిటంటే.. పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధాన్ని మరచిపోయి ఆమెను ఆరాధిస్తారు. ఆపై మహాభారతం కొత్త భారతదేశంలో తిరిగి రాయబడుతుంది. ప్రపంచం గర్విస్తుంది. ఇండియా…జై బీజేపీ”అని పేర్కొనగా..

‘‘ గౌరవనీయమైన ద్రౌపది జీపై నేను చేసిన విస్తృత పరిశోధన.. ఆమె కళ్ల తీవ్రత, ఆమె చిరునవ్వు, ముఖ రూపురేఖలు రెండింటి లోతుల్లోని సూక్ష్మ నైపుణ్యాలను అధ్యయనం చేసిన తర్వాత.. ఆమె మొత్తం ప్రపంచానికి గొప్ప రాష్ట్రపతి అవుతారనడంలో నాకు సందేహం లేదు… ధన్యవాదాలు బీజేపీ’’ అని రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement