మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ‘మగధీర’తో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆరెంజ్ మూవీ డిజాస్టర్ తర్వాత‘ఎవడుతో హిట్ అందుకున్నాడు. అయితే, తర్వాత గోవిందుడు అందరి వాడేలే’, బ్రూస్‌లీ’, ‘వినయ విధేయ రామ’ వంటి డిజాస్టర్ లను ఎదుర్కొన్నాడు. తర్వాత‘ధృవతో మరోసారి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం’తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ‘జంజీర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ ఫలితాన్నే అందుకుంది. ఇటీవలే పాన్ ఇండియన్ మూవీ RRR సినిమాతో సినీ లవర్స్ ముందుకు వచ్చాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చుకున్న చెర్రీ.. మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటించి మొప్పించాడు.
ఇక, తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు. ఆయనను సినిమాల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి ‘ఖైదీ నెంబర్ 150′ అనే సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని నిర్మించాడు. అయితే, ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తూ ఆచార్య సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీని టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దీనితోపాటు పలు ప్రాజెక్టుతోనూ చెర్రీ బీజీగా ఉన్నాడు. ఆచార్య మూవీతో మెగా అభిమానులను త్వరలో పలకరించబోతున్నారు.
తన సినీ కేరియర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు. ఇలా గతంలో ఏ టాలీవుడ్ స్టార్ హీరో చేయలేదు. ఇక, పై కూడా మల్టీ స్టార్ సినిమాలు చేస్తానని అంటున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి హ్యాప్తీ బర్త్ డే.