తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఖాళీ ఏర్పడింది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఈ నెల 30న ఎన్నిక జరుగనున్నది. ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024, ఏప్రిల్ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్ ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక జరగనున్న రాజ్యసభ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శాసనసభలో వందకుపైగా ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక నిర్వహించేందుకు- వెలువడనున్న నోటిఫికేషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement