Saturday, November 23, 2024

Breaking: రాజ్యసభ మార్చి 14కు వాయిదా

రాజ్యసభ సమావేశాలు మార్చి 14 వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పార్లమెంటు సమావేశాలను కోవిడ్ కారణంగా రెండు విడతలుగా జరపాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి విడత పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి. వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో ఈరోజు సభ్యులు కొంత గందరగోళం జరగడంతో రాజ్యసభను వాయిదా వేశారు. తిరిగి రాజ్యసభ వచ్చే నెల 14 వతేదీన మొదలు కానుంది. ఈరోజు సాయంత్రం లోక్ సభ జరగనుంది. లోక్ సభలో కూడా బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్చి14వ తేదీకి వాయిదా వేయనున్నారు. ఇక రాజ్యసభ వాయిదా పడినట్లు చైర్మన్ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement