Monday, November 25, 2024

ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌పై రాజ్‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆర్మీ హెలికాప్టర్ నిన్న త‌మిళ‌నాడు రాష్ట్రంలో కుప్ప‌కూలి బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను లోక్ సభలో… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కానీ మధ్యాహ్నం 12:08 గంటలకు సుల్లూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది దుర్మరణం చెందారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ కూలిపోవ‌డాన్ని అక్క‌డే ఉన్న‌ స్థానికులు గమనించారని.. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైందనీ రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement