భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈరోజు నియమితులయ్యారు. మే 14న సుశీల్ చంద్ర పదవీ విరమణ చేసిన తర్వాత మే 15న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఆదివారం (మే 15) బాధ్యతలు స్వీకరించనున్నారు. సుశీల్ చంద్ర తర్వాత ఆయన ఎన్నికల సంఘంలో అత్యున్నత పదవిని చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని రెండో క్లాజ్ ప్రకారం రాజీవ్ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజీవ్ కుమార్ నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement