మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అందరు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. 2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానం మిగిలిన దోషుల విషయంలో కూడా వెల్లడైందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆరుగురు దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement