60మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థుల్లో స్వల్ప లక్షణాలు కనిపించాయి. కాగా పాజిటీవ్ వచ్చిన వారందరిని ఐసోలేషన్ కు తరలించారు. పంజాబ్ పటియాలాలోని రాజీవ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్సిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించారు.గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం కాలేజీలు, పాఠశాలల్లో బాధితులు వెలుగుచూస్తున్నారు. ఈ మధ్యే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్ బాలికల పాఠశాలలో 16 మంది విధ్యార్థినులకు పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్‌లో స్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక ఐఐటీ మద్రాస్‌లో 170 కేసులు బయటపడ్డాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement