సూపర్ స్టార్ రజనీకాంత్ మరో ప్రాజెక్టు చేపట్టారు. తన 169వ సినిమాని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటంటే.. ఈ సీనియర్ నటుడు రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్న తన తదుపరి సినిమా ‘జైలర్’ త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంద. ఇతర నటీనటులు, సిబ్బంది గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన జైలు సెట్లో తమిళ సినిమా సూపర్ స్టార్ పనిని ప్రారంభిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్‌ను స్టైల్ చేయడానికి సుప్రసిద్ధ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను కూడా ఎంపిక చేసుకున్నారు. అయితే.. ప్రముఖ స్టైలిస్ట్ చేసిన ట్వీట్ ఆధారంగా ఈ విషయాలు ఇంకొన్ని బయటికి వస్తున్నాయి. సూపర్ స్టార్ లుక్‌పై ఈ స్టైలిస్టు పని చేస్తున్నాడన్న విషయం మరింత బలపడింది.
జులై 24న రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేశాడు ఆలీమ్. “మా సినీ రారాజుతో కలిసి పని చేయడంలో ఎంతో సంతోషంగా ఉంది. ఇదో అద్భుతమైన రోజు! సార్ రజనీకాంత్!” అని ట్వీట్ చేశారు.