దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. దీనికి తోడు కరోనా కేసులు 13,154నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పలు సూచనలు చేశారు. ఢిల్లీ, హర్యానా,తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు లేఖలు కూడా రాశారు. ఈ ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ పరీక్షలను వేగవంతం చేయాలన్నారు. హాస్పటల్స్ లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలన్నారు. కోవిడ్ మరణాలు పెరగకుండా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించినట్టుగా తెలిపారు. ఢిల్లీలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్టుగా ఉన్నత వర్గాలు తెలిపాయి.కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..