Tuesday, November 26, 2024

స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడానికి.. అబ్బాయిలా మారిన టీచర్

ప్రేమ పలు రకాలు..వయసు మాట పక్కన పెడితే అమ్మాయి..అబ్బాయి ప్రేమించుకోవడంలో వింత లేదు. కానీ అమ్మాయి అమ్మాయిలు ప్రేమించుకోవడం..అబ్బాయి అబ్బాయిలు లవ్ లో పడటం ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే రాజస్థాన్ భరత్ పూర్ లో చోటు చేసుకుంది. స్కూల్ లో పీటీ టీచ‌ర్ ఆర‌వ్ కుంతాల్ ఓ మ‌హిళ. అయితే ఆమె కొన్నేళ్ల నుంచి త‌న విద్యార్థినితో డేటింగ్ చేస్తోంది. ఇటీవ‌ల క‌ల్ప‌నా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న‌ది. వాస్త‌వానికి ఇది విరుద్ద‌మైన ఆచార‌మే అయినా.. ఆ పెళ్లికి ఇద్ద‌రి పేరెంట్స్ ఒప్పుకున్నారు. టీచ‌ర్ ఆర‌వ్ అస‌లు పేరు మీరా. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లో ఆమె క‌బ‌డ్డీ నేర్పించేది. ఆ స్కూల్‌లోనే క‌ల్ప‌న స్టూడెంట్‌.2016లో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం జ‌రిగింది. మీరా, క‌ల్ప‌నాల మ‌ధ్య మెల్ల‌మెల్ల‌గా ఫ్రెండ్‌షిప్ ముదిరింది. రెండేళ్లు ఫుల్ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఆ త‌ర్వాత 2018లో క‌ల్ప‌న‌కు మీరా ప్ర‌పోజ్ చేసింది. మీరా చేసిన పెళ్లి ప్ర‌పోజ్‌ల‌కు క‌ల్ప‌న అంగీక‌రించింది. కానీ త‌మ‌ పెళ్లికి పేరెంట్స్ నుంచి వ‌త్తిడి ఉంటుందని ఆ ఇద్ద‌రు అమ్మాయిలు గ్ర‌హించారు. అందుకే మీరా లింగ‌మార్పిడికి సిద్ద‌మైంది. క‌ల్ప‌న‌ను పెళ్లి చేసుకునేందుకు మ‌గ‌వాడిగా మారేందుకు స‌ర్జ‌రీ చేయించుకుంది.స‌ర్జ‌రీ త‌ర్వాత ఆర‌వ్‌గా పేరు మార్చుకున్న‌ది. 2019 డిసెంబ‌ర్‌లో మీరా తొలి స‌ర్జ‌రీ చేయించుకున్న‌ది. ఆర‌వ్‌ను ముందు నుంచే ప్రేమిస్తున్నాన‌ని, ఒక‌వేళ అత‌ను స‌ర్జ‌రీ చేయించుకోకున్నా.. నేను అత‌న్నే పెళ్లి చేసుకునేదాన్ని అని క‌ల్ప‌న తెలిపింది.ఇక స‌ర్జ‌రీ స‌మ‌యంలో ఆర‌వ్‌తోనే తాను ఉన్నానని వెల్లడించింది కల్పనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement