రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా భద్వాకు చెందిన పూర్ఖారామ్(42) వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అదేంటంటే రోజుల తరబడి నిద్రపోవడం. ఈ వ్యాధిని హైపరోసోమ్నియాగా పిలుస్తారు. అతను మేల్కోవాలి అని అనుకున్నా.. అందుకు శరీరం సహకరించదు. ఒక్కోసారి నిద్ర నుంచి లేవడానికి 25 రోజులు పడుతుందని పూర్ఖారామ్ కుటుంబం బాధపడుతోంది. గత 23 సంవత్సరాలుగా అతని పరిస్థితి ఇదేనని వెల్లడించింది. సమస్యను వైద్యులు పరిష్కరించాలని కోరుతోంది.
పూర్ఖారామ్ పడుకోవడానికి ఒకరోజు ముందు తీవ్రంగా తలనొప్పితో బాధపడతాడు. అంతేకాకుండా పడుకోవడానికి ఒకరోజు ముందే కడుపునిండా తింటాడని, తాగుతాడని, ఏం కావాలంటే అది చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే అతడు మళ్లీ 25 రోజుల తర్వాత మేల్కొంటాడు కాబట్టి. అతడు పడుకుని ఉండగానే అతడి బంధువులు ఆహారం పెడతారట. ఇప్పటివరకు పూర్ఖారామ్ వ్యాధి తగ్గకపోయినా భవిష్యత్లో అతడు వింత వ్యాధి నుంచి బయట పడతాడని భార్య లక్ష్మీదేవి, తల్లి కన్వరి దేవి ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈ వార్త కూడా చదవండి: పిల్లి ఆచూకీ చెప్పినవారికి రూ.30వేల బహుమతి