భారత్ లో బూస్టర్ డోసులకు అనుమతి వచ్చింది. బూస్టర్ డోసుగా వినియోగించుకునేందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు DCGI అనుమతి ఇచ్చింది. బూస్టర్ డోసులుగా అనుమతి పొందిన తొలి టీకాగా కోవిషీల్డ్ నిలిచింది. కోవిషీడ్డ్ వల్ల ప్రజల్లో రోగనిరోధకశక్తిని పెంచుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం అభిప్రాయాన్ని తెలిపింది. కరోనా తీవ్ర లక్షణాలు ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది.. దేశంలో బూస్టర్ డోసులు వేసేందుకు అవసరమైన వ్యాక్సిన్లు ఉన్నాయని సీరం సంస్థ వెల్లడించింది. ఓమిక్రాన్ తీవ్రత పెరిగిన తర్వాత బూస్టర్ డోసులకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు కూడా బూస్టర్ డోస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రతిపాదనుల వస్తున్నాయి. మరోవైపు కోవాగ్జిన్ కూడా బూస్టర్ డోసుల అనుమతి కోసం ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో కోవాగ్జిన్ కూడా బూస్టర్ డోస్ అనుమతి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement