ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ సుధ కుటుంబ సమేతంగా ఆదివారం రోజున దర్శించుకున్నారు. జస్టిస్ కుటుంబ సభ్యులకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చక బృందం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణమండపంలొ అర్చకబృందం వేదోక్త ఆశీర్వచనం గావించారు.ఆలయ ఏఈఓ శ్రీనివాస్ శేషవస్త్రం అందించి ప్రసాదం అందజేసి సత్కరించారు.
వీరి వెంట స్థానిక మేజిస్ట్రేట్ ,డిఎస్పీ చంద్రకాంత్ ,ఆర్డీఓ లీలావతి, తహసీల్దార్ మునీందర్, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు వున్నారు.
రాజన్నను దర్శించుకున్న – హైకోర్టు జస్టిస్ శ్రీసుధ
Advertisement
తాజా వార్తలు
Advertisement