సినిమాలకు షూటింగ్ స్పాట్ గా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లా. కాళేశ్వర జలాల రాకతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం, అన్నపూర్ణ రిజర్వాయర్, సింగసముద్రం చెరువు నిండుకుండల్లా మారి పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పుష్కలంగా నీరుండటంతో ఎటుచూసినా పచ్చని పైర్లతో కోనసీమ అందాలను మైమరపిస్తున్నాయి. దీంతో జిల్లాలో పలు సినిమాల షూటింగ్లు ఊపందుకొన్నాయి. రాజరాజేశ్వర జలాశయ పరివాహక ప్రాంతంలో ఇటీవల హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయంతోపాటు నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, భీముని మల్లారెడ్డిపేట మండలాల్లో షార్ట్ ఫిలింల చిత్రీకరణలు జరిగాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement