Friday, November 22, 2024

‘రాజా విక్ర‌మార్క‌’..హిట్టా ..ప‌ట్టా..

కొన్ని సినిమాలు క‌థ ఉన్నా న‌డ‌ప‌డంలో త‌డ‌బ‌డుతుంటారు డైరెక్ట‌ర్లు..ఆ దెబ్బ‌కి హిట్ కావాల్సిన చిత్రం ఫ‌ట్ట్ అవుతుంటాయి. ఇప్ప‌టికే అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కాగా యంగ్ హీరో కార్తికేయ న‌టించిన తాజా చిత్రం రాజా విక్ర‌మార్క‌..మెగాస్టార్ చిరంజీవి పాత చిత్ర టైటిల్ ని పెట్టి హైప్ ని క్రియేట్ చేశారు. సరైన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న కార్తికేయ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..మ‌రి ఎలా ఉందో చూద్దాం. రాజా విక్రమార్క పాత్ర‌లో కార్తికేయ మెరిశాడు.కాగా కొత్తగా రిక్రూట్ కాబడిన ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు. తన జాబ్ లోని ఛాలెంజ్ లకు అలవాటు పడుతూ ఉంటాడు.

అయితే సడెన్ గా రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూతురు హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ కిడ్నాప్ కేసును.. విక్రమార్క డీల్ చేయాల్సి వస్తుంది. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు.. వాళ్లకు కావాల్సింది ఏంటి.. హోమ్ మినిస్టర్ కూతుర్ని విక్రమార్క రక్షించగలిగాడా.. అనేదే మిగ‌తా క‌థ‌…కాగా హీరో కార్తికేయ తన పాత్రకు 100 శాతం న్యాయం చేసాడు. తన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ అన్నీ కూడా పాత్రకు సరిగ్గా సరిపోయాయి. ఈ పసలేని యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అంటే కార్తికేయ అనే చెప్పాలి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది అండ్ ఆమె పర్వాలేదు. తనికెళ్ళ భరణి కీలక పాత్రను చేసాడు. తన పాత్రకు న్యాయం చేయగలిగాడు. సుధాకర్ కొమాకుల కూడా ప్రధాన పాత్రను పోషించాడు. తన పెర్ఫార్మన్స్ కూడా డీసెంట్ గా ఉంది. ఈ చిత్రంతో శ్రీ సారిపల్లి దర్శకుడిగా అరంగేట్రం చేసాడు కానీ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడ‌నిపిస్తోంది. ఓవ‌రాల్ గా అయితే ఈ చిత్ర స్టోరీ లైన్ లోనే క్లారిటీ లేదు.మ‌రి ఈ చిత్రం చూడాలా వ‌ద్దా అనేది ఆడియోన్స్ అభిప్రాయంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement