Thursday, November 21, 2024

రాజ్ కుంద్రాని తప్పుగా అర్థం చేసుకోవద్దు: రాఖీ సావంత్

రాజ్ కుంద్రా సినీ ఇండస్ట్రీలో రియల్ పర్సన్, ది బెస్ట్ అని.. అతడిని అపార్థం చేసుకోవద్దని సినీ నటి రాఖీ సావంత్ కోరింది. ఈ మద్య రాజ్ కుంద్రా కోడలు షమితా శెట్టి బర్త్ డే సందర్భంగా భార్య శిల్పా శెట్టితో కలిసి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రాఖీ సావంత్ రాజ్ కుంద్రాతో సెల్ఫీ వీడియో తీసుకుని ఈ విషయం వెల్లడించింది.

కాగా, పోర్నోగ్రఫీ కేసులో తను ఇరుక్కున్నపుడు తనకు మద్దతు ఇవ్వనందుకు బాలీవుడ్‌ను విమర్శిస్తూ రాజ్ కుంద్రా పలు విమర్శలు చేశాడు..  పోర్న్ ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ కేసులో రాజ్ కుంద్రా జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. తను బెయిల్‌పై విడుదలైన తర్వాత ఈ మొత్తం వివాదంపై ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. ‘‘చాలా ఆలోచించిన తర్వాత ఈ లేఖ విడుదల చేస్తున్నా.. అందరినీ తప్పుదారి పట్టించే.. బాధ్యతా రహితమైన ప్రకటనలు..  కథనాలు నా చుట్టూ తిరుగుతున్నాయి.  నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు..  నేను నా జీవితంలో ఎప్పుడూ ‘అశ్లీలత’ వంటి వీడియోలు తీయడం.. వాటి పంపిణీలో పాలుపంచుకోలేదు’’ అని వెల్లడించాడు. 

కానీ, తాను ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు రాజ్ కుంద్రా. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, అక్కడ నిజం గెలుస్తుందని తెలిపాడు. మీడియాలో తప్పుడు కథనాలతో తమ  ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement