Friday, November 22, 2024

ఆర్థిక ఇబ్బందులున్నా రైతుబంధు ఆగ‌దు.. ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతుపక్షపాత ప్రభుత్వంగా జాతీయ స్థాయిలో పేరున్న తెలంగాణ సర్కార్‌ మరో విడత రైతుబంధు సాయం అందజేతకు సిద్ధమవుతోంది. ఆర్ధికంగా సతమతమవుతునకనా, కేంద్ర సాయంలో వివక్ష అడుగడుగునా అభివృద్ధికి ఆటంకంగా మారినా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను మరోసారి నిలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం రాష్ట్ర అప్పుల సేకరణకు అడ్డంకులెన్ని సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతుకు అండగా రైతుబంధుతో ఆదుకునేలా చర్యలు తీసుకుంటోంది, ఈ నెల 20తర్వాత వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతాంగానికి చెందిన ఖాతాల్లో నగదును జమచేసేలా సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. మొదటిరోజు ఎకరంలోపు భూమి కల్గిన రైతులకు, రెండో రోజు రెండెకరాలకు, మూడోరోజు మూడెకరాలకు ఇలా వరుసగా నిధుల సర్దుబాటుతో రైతులకు ప్రయోజనం కల్గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా, అదనపు అప్పులు ఇవ్వకుండా ఆర్భీఐని అడ్డుకున్నా సీఎం కేసీఆర్‌ మనోభీష్టాన్నికి ఏ మాత్రం విఘాతం కల్గకుండా రైతుబంధుకు నిధుల సమీకరణ షురూ అయింది.

యాసంగిలో 63లక్షల మందికి చెందిన 148 లక్షల ఎకరాలకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 7412కోట్లను చెల్లింపులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకం ఆరంభమైన 2018నుంచి మొత్తం ప్రభుత్వం చేసిన చెల్లింపుల మొత్తం రూ. 50,448కోట్లకు చేరుకుంది. 8 సీజన్లలో చెలల్‌ంపులు చేసిన ప్రభుత్వం తాజాగా నెలకొన్న ఆర్ధిక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ మహా యజ్ఞం విజయవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ చేస్తోంది. ఈ పథఖం ద్వారా 53శాతం మంది రైతులు బీసీ వర్గాలకు చెందిన వారుండగా, 13శాతం ఎస్సీ, ఎస్టీలు, 21శాతం ఇతరులు ప్రయోజనం పొందుతున్నారు. మొత్తం ఇప్పటివరకు చెల్లించిన రైతుబంధు నిధుల్లో 48శాత నిధులు బీసీ రైతులకు, 30శాతం ఇతర వర్గాలకు, 13శాతం ఎస్సీ, 9శాతం ఎస్టీలకు దక్కాయి.

సీజన్‌ లబ్దిదారుల సంఖ్య మొత్తం(రూ. కోట్లలో
వానాకాలం 2018 50.25 5236
యాసంగి 2018 49.13 5252
వానాకాలం 2019 51.61 6126
యాసంగి 2019 42.42 4406
వానాకాలం2020 58.02 7289
యాసంగి 2020 59.32 7367
వానాకాలం 2021 60.84 7360
యాసంగి 2021 63.00 7412

Advertisement

తాజా వార్తలు

Advertisement