అసోంలో ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ప్రారంభించారు రతన్ టాటా.. ప్రధాని మోదీతో కలసి అసోంలో ఏడు కేన్సర్ ఆసుపత్రులను రతన్ టాటా ప్రారంభించారు. అసోం కేన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మొత్తం 17 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. అసోం ప్రభుత్వం, టాటా ట్రస్ట్ ల జాయింట్ వెంచరే అసోం కేన్సర్ కేర్ ఫౌండేషన్. ఈ సందర్భంగా రతన్ టాటా తన ప్రసంగంతో మోడీ సహా అక్కడకు వచ్చిన వారు అందరినీ కట్టిపడేశారు. ‘‘నేడు అసోం రాష్ట్ర చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్య సంరక్షణ, కేన్సర్ చికిత్సా పరంగా అసోం రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన రోజు. కేన్సర్ ఎంత మాత్రం సంపన్నుల వ్యాధి కాదు. లక్షలాది మందికి చికిత్స చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి, ప్రధాని మద్దతు లేకుండా ఇవి జరిగేవికావన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement