రెండోరోజు ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోన్న వేళ ..ఓ అమ్మాయివైపే కళ్లన్నీ పడ్డాయట. ఎవరా అమ్మాయి అని ఆరా తీశారట. ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని. అంతేకాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, మీడియా దిగ్గజం కళానిధి మారన్ కుమారై కావ్యా మారన్. ఐపీఎల్ మెగా వేలంలో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, ప్రీతి జింటా, కొందరు హేమాహేమీలు వేలంపాటకు హాజరయ్యారు. అయితే, వారందరినీ కాదని అందరి కళ్లూ ఓ అమ్మాయిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఆమెనే కావ్యా మారన్. నిన్న వేలం ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె గురించే చర్చ నడుస్తోంది.
ఎస్ఆర్ హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ఆమె వేలంలో పాల్గొన్నారు. దీంతో అసలు ఆమె ఎవరు.. ఎస్ఆర్హెచ్ ఓనర్ ఎవరు.. అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ లో ఆమె పేరు బాగా ట్రెండ్ అయిపోయింది. 2018 వేలం సమయంలోనూ కావ్యా మారన్ పేరు ట్రెండ్ అయింది. అప్పట్లో ఆమెను ఎస్ఆర్ హెచ్ ఆక్షన్ గర్ల్ అంటూ ట్విట్టర్ లో వైరల్ చేశారు. ఇక తొలిసారి ఆమె 2018 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఆమె అందరికీ కనిపించారు. ప్రస్తుతం ఆమె సన్ మ్యూజిక్, సన్ టీవీకి చెందిన ఎఫ్ఎం చానెల్స్ బాధ్యతలను చూసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..