Thursday, November 21, 2024

Mitron: ప్రజలపైన పన్నుల భారం రెట్టింపు, మిత్రోస్​కి మినహాయింపులు.. ఇదే బీజేపీ విధానం: రాహుల్​ గాంధీ

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్​ అధినేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. సామాన్య ప్రజలకేమో పన్నుల మీద పన్నులు వేస్తున్నారు. కానీ, మిత్రోస్​కు మాత్రం మినహాయింపులిస్తున్నారు అంటూ రాహుల్​ గాంధీ ఎద్దేవా చేశారు. దీనికి దేశంలో ఉన్న కార్పొరేట్​ పన్నులను, ప్రజలపై వేసే పన్నులను కంపేర్​ చేస్తూ ట్వీట్​ చేశారు. మిత్రోస్​కు పన్నులు తగ్గించడమే ఈ సూటుబూటు దోపిడీ సర్కార్​కు సహజమైన చర్యగా మారిందని రాహుల్​ గాంధీ తన ట్వీట్​లో పేర్కొన్నారు. 

ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను కంపేర్​ చేసిన వయనాడ్ ఎంపీ రాహుల్​ గాంధీ.. ప్రజలపై బీజేపీ ఎక్కువ పన్ను విధించడాన్ని, కార్పొరేట్లపై తక్కువ పన్ను విధించడాన్ని ప్రధానంగా ఎంచుకుందని పేర్కొన్నారు. పేదలకు అందించే చిన్న మొత్తాల సహాయాన్ని బీజేపీ ఉచితాలుగా చెబుతోందని.. అయితే ప్రభుత్వం మాత్రం తన ధనిక మిత్రులకు తక్కువ పన్ను రేట్లు, రైటాఫ్‌లు.. మినహాయింపుల ద్వారా పొందుతున్న ఉచితాలను ‘అవసరమైన ప్రోత్సాహకాలు’గా వర్గీకరిస్తోందని సెటైరిటకల్​గా చెప్పారు రాహుల్​ గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement