Saturday, November 23, 2024

కొలంబియాలో వ‌ర్ష బీభ‌త్సం – విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు -14మంది మృతి

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 14మంది మృతి చెందారు. మ‌రో 35మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప‌శ్చిమ‌కొలంబియాలోని పెరీరా మున్సిపాలిటీలో రిస‌రాల్డాలో భారీ వ‌ర్షాలు ప‌డ‌టంతో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాంతో బురద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి కనీసం 14 మంది మృతిచెందార‌ని అధికారులు వెల్ల‌డించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఒకరి ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు చెప్పారు. మరికొందరి కోసం రెస్క్యూ బృందాలు బురదలో వెతుకుతున్నాయని కొలంబియా విపత్తు నిర్వహణ అధికారులు వివ‌రించారు. మృతుల సంఖ్యను పెరీరా మేయర్ కార్లోస్ మాయా ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా పొంచి ఉందన్నారు. మరింతగా ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రజలు కొండచరియలు అవకాశం ఉన్న ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు.

రంగంలోకి దిగిన ప్రభుత్వ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో చెక్కతో నిర్మించిబడిన అనేక ఇళ్లు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను ఆ బృందాలు గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే 60 కంటే ఎక్కువ ఇళ్లలో నివసించే వారిని ఖాళీ చేయించారు. భారీ వర్షాల కారణంగాల బురద నీటిలో కురుకుపోయిన మరణించిన వారి కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో చాలా పెద్ద శబ్ధం వచ్చిందని.. తాము భయాందోళన చెందామని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ తెలిపారు. తాము బయటకు వెళ్లి చూస్తే కొండ కొంత భాగం ఇళ్లపై పడటం కనిపించిందని చెప్పారు. కొలంబియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. దేశంలో వర్షాకాలంలో నిటారుగా ఉండే కొండలపై నిర్మించబడిన ఇళ్లు ప్రమాదానికి గురవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement