తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనవరి 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత కొంత తగ్గింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital