Tuesday, November 19, 2024

Yellow Alert: తెలంగాణకు వర్ష సూచన.. రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు!

గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తూర్పు విదర్భ నుండి దక్షిణ కోస్తా, ఆంధ్ర ప్రదేశ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడడం.. రుతుపవనాల తీవ్రతకు దారితీసే కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్‌ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్‌ ఉంది. అంతేకాకుండా ఇవ్వాల (సోమవారం) మహబూబ్‌నగర్, గద్వాల్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఇక.. మహబూబ్‌నగర్‌లోని చిన్న చింత కుంటలో అత్యధికంగా 139.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్​ సిటీలో పలు చోట్ల భారీ వర్షం కురవగా.. కొన్ని ప్రాంతల్లో మోస్తరు జల్లులు కురిశాయి. అయినా సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement