హైదరాబాద్, ఆంధ్రప్రభ : నైరుతి రుతుపవనాల్లో ఎటువంటి జాప్యం లేదని మరో రెండు రోజుల్లో రుతు పవనాలు మహారాష్ట్రను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇప్పటికే రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించాయని మహారాష్ట్ర సహా కర్నాటక, తమిళనాడుల్లో మరో రెండు రోజుల్లో పురోగతి కనిపిస్తుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా పురోగమిస్తున్నాయని మే 31 – జూన్ 7 మధ్య దక్షిణ మధ్య అరేబియా మహా సముద్రం, కేరళ మొత్తం, కర్నాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతు పవనాలు ప్రవేశించాయని తెలిపింది. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశం నుంచి మొత్తం వర్షపాతం నమోదైందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని మరో రెండు రోజుల్లో బలమైన గాలులు వీసి మేఘాలు దట్టంగా కమ్ముకోవడం జరుగుతుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.