తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది.
రేపు కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అలాగే రేపటి నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో పొద్దంతా ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. చల్లనిగాలులతో నగరవాసులు ఎండవేడి, వేడిగాలుల నుంచి ఉపశమనం పొందారు.