తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చి బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. దక్షిణ గాంగటక్ నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement