Saturday, November 23, 2024

Weather Report: తెలుగురాష్ట్రాల్లో భారీగా వర్షాలు..

తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని ఈ రోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, అంబర్ పేట్, హిమాయత్‌నగర్, రామంతపూర్, గోల్నాక, నాగోల్, నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, దిల్‌షుఖ్‌నగర్‌, ఉప్పల్, మలక్‌పేట్‌, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లోనూ ఓ మోస్త‌రు వ‌ర్షం కురుస్తోంది. గ‌త మూడు రోజులుగా తెలంగాణ‌లోని నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, వికారాబాద్ తదితర ప‌లు జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు రైతులు పెద్ద ఎత్తున పంట న‌ష్టపోయారు.

మ‌రోవైపు, ఏపీలోని ప‌లు జిల్లాల్లోనూ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యయి.  రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు న‌ష్టం వ‌చ్చింది. మొక్క జొన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital



Advertisement

తాజా వార్తలు

Advertisement