ఐస్ హాకీ ఆట గురించి మీకు తెలుసా. ఈ ఆటని అమెరికా పెన్సిల్వేనియాలో ఆడతారు. ఈ ఆట ఆడటం అమెరికాలో సంప్రదాయంగా వస్తోంది. అయితే సిరీయస్ గా ఆట జరుగుతోంది. ప్రేక్షకులు అంతా ఆటమీదే తమ దృష్టిని పెట్టారు. ఇంతలో ఓ ప్లేయర్ దూసుకొని వెళ్ళి గోల్ కొట్టాడు. దాంతో ప్రేక్షకులు తమ వెంట తెచ్చుకున్న టెడ్డీ బేర్లని ఐస్ హాకీ ఆడే మైదనాంలోకి విసిరారు. దాంతో మైదానం అంతా టెడ్డీబేర్లతో నిండిపోయింది. వేల సంఖ్యలో టెడ్డీలు కనువిందుని చేశాయి. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. అమెరికా పెన్సిల్వేనియాలోని హర్ష్లీలో ఉన్న గెయింట్ సెంటర్లో ఈ దృశ్యం కనిపించింది. ఐస్ హాకీ ఆటలో ఇలాంటిది తరచుగా కనిపించేదే. ఈ బొమ్మలన్నింటినీ సేకరించి.. వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు నిర్వాహకులు. 2001 నుంచి 2.7 లక్షల బొమ్మలను ఇలా సేకరించారు. 2019లో 45,650 టెడ్డీలను విసిరి రికార్డు సృష్టించారు ప్రేక్షకులు. ఆరోజు జరిగిన మ్యాచ్ అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..