నైరుతి రుతుపవనాలు ఆగమనంతో తెలంగాణ రాష్ట్రంలో మొదట్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే, గత నాలుగు రోజులుగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతం అయి, గాలులు వీస్తున్నప్పటికీ వర్షపు చక్క జాడ మాత్రం లేదు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సెంటీమీటరు వర్షం కూడా కురవలేదు. తెలంగాణలో రుతుపవనాల మందగమనం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా మారింది. నల్గొండ జిల్లా పులిచర్లలో నిన్న పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 37.6, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోకి రుతుపనాలు ప్రవేశించిన తర్వాత ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తగ్గిన వర్షం..పెరిగిన ఉష్ణోగ్రతలు..
- Tags
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- mansoon
- Most Important News
- rain
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- TS News Today Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement