బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఉత్తర ఒడిసా తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అలాగే నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. అలాగే శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గత మూడు రోజులుగా తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ అల్పపీడనాలు ఏర్పడటంతో వానలు కురుస్తాయని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.
ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం.. 3 నెలల టార్గెట్