Friday, November 22, 2024

తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు..

తెలంగాణలో కొద్ది విరామం తర్వాతా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు చోట్ల భారీగా వర్షాలు కురిసాయి. ఇవాళ కూడా పలు ప్రాంతీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, కామరెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.

ఇక సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములుఎ, మెరుపులతో కూడిన వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే జూన్‌ 29 ఉదయం నుంచి జులై 1 ఉదయం వరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతరణ కేంద్రం వెల్లడించింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. కాప్రాలో 68 మి.మీ, అల్వాల్‌లో 21.8, సికింద్రాబాద్‌లో 20.8 మి.మీ.ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement