ఉపరితల ద్రోణి బలహీనపడటంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురువనున్నాయి. పశ్చిమ, వాయవ్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇవాళ ఓ మోస్తారు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది వాతావరణశాఖ. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 44 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా చలకుర్తిలో అత్యధికంగా 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, భద్రాద్రి జిల్లాలోని మల్కారంలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: డ్రైనేజీ పైపుల ద్వారా ఇండియాలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు