Wednesday, November 20, 2024

తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు..

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉత్తర ఇంటీరియర్‌ ద్రోణి బలహీన పడటంతో…నైరుతి దిశనుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురువనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురువొచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మో స్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా వైరాలో 4.9 సెంటీమీటర్ల వాన పడింది.

ఇది కూడా చదవండి: ఈ రోజు బంగారం ధర ఎంతో తెలుసా..

Advertisement

తాజా వార్తలు

Advertisement