Saturday, November 23, 2024

తెలంగాణలో ఈ మూడు రోజుల్లో వర్షాలు

కేర‌ళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా జూన్‌ రెండో తేదీ వరకు రాష్ట్రం‌లోని పలు‌జి‌ల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరు‌ములు, మెరు‌పులు, గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీస్తూ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గడి‌చిన 24 గంటల్లో రాష్ట్రం‌లోని 20 జిల్లాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా వికా‌రా‌బాద్‌ జిల్లా బంట్వా‌రంలో 53.3 మిలీ‌మీ‌టర్ల వర్షం కురి‌సింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శని‌వారం 36.0 నుంచి 44.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య నమో‌ద‌య్యాయి. నిర్మల్‌ జిల్లా కుబీ‌ర్‌లో అత్యల్పంగా 22.4 డిగ్రీల ఉష్ణో‌గ్రత రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement