Thursday, November 14, 2024

Breaking: హైదరాబాద్​లో పలు చోట్ల వర్షం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్​ సిటీలోని పలుప్రాంతాల్లో తెలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. మారికాసేపట్లో బీజేపీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. సభా ప్రాంతానికి కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ సభనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నరు. కాగా, ముఖ్య ప్రాంతాలైన కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్‌, హైదర్షాకోట్‌, గండిపేట్‌లో మోస్తరు జల్లులు పడ్డాయి. బేగంబజార్, ఏంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో వానపడింది. పలుచోట్ల ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఇక.. రాష్ట్రంలో రాబోయే 3 రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ దాని పరిసరాల్లో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో జార్ఖండ్ దాని పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement